యాక్షన్ థ్రిల్లర్‌ మూవీతో శౌర్య-వీడియో - Tolivelugu

యాక్షన్ థ్రిల్లర్‌ మూవీతో శౌర్య-వీడియో

నాగ శౌర్య హీరోగా రమణ తేజ దర్శకత్వంలో వస్తున్న సినిమా అశ్వత్థామ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా జనవరి 31 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే విడుదలయిన టీజర్… సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇప్పుడు తాజాగా చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను దర్శకుడు పూరి జగన్నాథ్ రిలీజ్ చేశారు. రెండు నిమిషాల ఏడు సెకెన్ల నిడివితో వచ్చిన ఈ ట్రైలర్ మొదట రాక్షసుడిని, భగవంతుడిని చూసిన కళ్ళు ఇక ఈ ప్రపంచాన్ని చూసే అర్హత కోల్పోతాయంటూ చెప్పిన డైలాగ్ తోనే సినిమా పై ఉత్కంఠతను పెంచుతుంది. ఆడపిల్లల జీవితాలు, వారి పై జరుగుతున్న దాడులు, అక్రంగా ఆడవాళ్లను అమ్మే గ్యాంగ్ లపై ఈ సినిమా తెరకెక్కించినట్టు తెలుస్తుంది.

ఎటువెళ్లినా… మూసుకుపోతున్న దారులు, ఒకరితో ఒకరికి సంబంధం లేని వ్యక్తులు, వేట కుక్కల్లా వెంటపడే జాలర్లు, శకుని లాంటి ముసలోడు వీళ్లందరినీ ఒకే స్టేజ్ పై నడిపిస్తున్న ఆ సూత్రధారి ఎవరు అనే అంశం చుట్టూ ఈ కథ సాగనుంది. ఆ సూత్రదారిని కనిపెట్టే ఓ చెల్లికి అన్నగా శౌర్య కనిపించనున్నాడు. మొత్తంగా ఓ యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమాని దర్శకుడు రమణ తేజ తెరకెక్కించినట్టు అర్ధం అవుతుంది. నాగశౌర్యకు జంటగా మెహ్రీన్ నటించింది.

Share on facebook
Share on twitter
Share on whatsapp