యూత్ హీరో నాగ శౌర్య, బబ్లీ బ్యూటీ మెహరిన్ జంటగా ఐరా క్రియేషన్స్ పతాకం వస్తున్న సినిమా అశ్వథ్థామ. నూతన దర్శకుడు రమణ తేజ ఈ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. అటు క్లాస్ ఇటు మాస్ ఆడియెన్స్ ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో కాస్త ఎక్కవుగానే యాక్షన్ సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్లుగా యూనిట్ సభ్యులు చెబుతున్నారు. ప్యాన్ ఇండియా హిట్ గా నిలిచిన కేజీఎఫ్ కి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు అరివు మాస్టర్స్ తెలుగులో మొదటిసారిగా నాగశౌర్య సినిమాకి యాక్షన్ కొరియోగ్రఫి చేస్తుండటం విశేషం. ఈ మూవీ రిలీజ్ డేట్ ప్రెస్ మీట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్మాత ఉష మూల్పూరి మాట్లాడుతూ….అందరికి నమస్కారం. ఐరా క్రియేషన్స్ ప్రొడక్షన్స్ నెంబర్ 3 అశ్వద్ధామ షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటుంది. సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనలు ఆధారంగా ఈ సినిమా కథాంశం ఉండబోతొంది. నాగ శౌర్య మంచి కథ రాశాడు, దాన్ని డైరెక్టర్ తెరమీద బాగా చూపించాడు. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉంటుందని తెలిపారు.