సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో నాగ శౌర్య హీరోగా తెరకెక్కుతున్న చిత్రం లక్ష్య. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే జగపతిబాబు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక ఈ చిత్రం డిసెంబర్ 10న రిలీజ్ కాబోతోంది. కాగా తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు U సర్టిఫికేట్ ఇచ్చింది.