సంతోష్ జాగర్లమూడి దర్శకత్వంలో నాగశౌర్య హీరోగా విలువిద్య నేపథ్యంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా నాగ శౌర్య కు 20వ సినిమా. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.
ఇక ఈ సినిమా టైటిల్ ను ఈరోజు విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది. విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా కావడంతో పార్ధు, అర్జున తో పాటు మరి కొన్ని పేర్లను అనుకున్నప్పటికీ చివరికి లక్ష్య పేరును ఖరారు చేశారని తెలుస్తోంది.