హిట్ ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్నాడు టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం వరుడు కావలెను, లక్ష్య, సినిమాలు చేస్తున్నాడు నాగశౌర్య. అయితే వరుడు కావలెను ఈ సినిమాలో నాగశౌర్య సరసన రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తుంది. లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకి సంబంధించి విడుదలైన లుక్స్, ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన మనసులోనే నిలిచి పోకె మైమరపుల మధురిమ… పెదవి దాటి వెలికి రాక బెదురెందుకె హృదయమా ఎన్నినాళ్ళిలా ఈ దోబూచుల సంశయం…అన్నివైపుల వెనుతరిమే ఈ సంబరం అంటూ సాగే గీతాన్ని విడుదల చేశారు.