యంగ్ హీరో నాగ శౌర్య ప్రధానపాత్రలో లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం వరుడు కావలెను. ఈ సినిమాలో రీతు వర్మ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు చిత్రయూనిట్.
ఇదే విషయాన్ని తెలుపుతూ కొత్త పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. అందులో అక్టోబర్ 15న ఈ సినిమాను విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమాను సితార ఎంటర్టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగ వంశీ నిర్మిస్తున్నారు. అలాగే ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నదియా, మురళీశర్మ కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు.