పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పై అధికార పార్టీ వైసీపీ ప్రతీకార రాజకీయాలు చేస్తోందని మెగా బ్రదర్ నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.భీమ్లా నాయక్ ను చూసి భయపడిన జగన్ రెడ్డి సినిమా థియేట్రికల్ రిలీజ్ కి ఇబ్బంది పెట్టడం, సినిమా టిక్కెట్ ధరలను భారీగా తగ్గించటం వంటివి చేశాడన్నారు.
అలా చేస్తే జగన్ రెడ్డికి మనం లొంగిపోతాం అనుకున్నాడని.. కానీ అలా ఏమీ జరగదని క్లారిటీ ఇచ్చారు. మన సినిమాలకు ఇబ్బందులు సృష్టిస్తున్నారు కాబట్టి కొత్త మార్గాలను అన్వేషించాల్సిన అవసరం ఉందన్నారు నాగ బాబు.
అదృష్టవశాత్తూ…. మా సినిమాలను నడపడానికి ప్రత్యామ్నాయ ప్లాట్‌ఫారమ్‌లు ఓటిటి, యూట్యూబ్ లు ఉన్నాయి. ఏపీ ప్రజల కోసం మాత్రమే ఓటిటి ప్లాట్‌ఫారమ్‌లలో సినిమాలను ప్రసారం చేసేలా చూడాలి అంటూ నాగబాబు ఓ వీడియో ను రిలీజ్ చేశారు.
అయితే నాగబాబు మాటలు విన్న తర్వాత, పవన్ నెక్స్ట్ ప్రాజెక్ట్ మేకర్స్ తమ సినిమాలను విడుదల సమయంలో ఏపీ వరకూ ఓటిటి లో విడుదల చేసే ఆలోచనలో ఉన్నారని అర్థమవుతోంది.