నా జబర్ధస్త్ జర్నీ ఈవారంతోనే అయిపోందని ప్రకటించారు నాగబాబు. నా స్థాయికి తగ్గ రెమ్యూనరేషన్ ఇవ్వకపోయినా… అదే కారణం కాదన్నారు నాగబాబు. నాకు కష్టకాలంలో జబర్ధస్త్ ఎంతో ఉపయోగపడిందని, నేను కూడా అంతేస్థాయిలో ఉపయోగపడ్డానని తెలిపారు. ఇక ఈ ఏడున్నర సంవత్సరాల జర్నీ ఇలా నాకు నేనుగా వెళ్లిపోవాల్సి వస్తుందని ఊహించలేదని, కానీ ఎక్కడో చోట తప్పదని తెలిపారు.
రాబోయే రోజుల్లో మరిన్నీ నిజాలు చెబుతానేమో అంటూ సస్పెన్స్‌ను ఇంకాస్త మిగిల్చారు నాగబాబు. మై జర్నీటు జబర్ధస్త్ ఫినిష్ అంటూ ప్రకటన విడుదల చేశారు. నాకు బిజినెస్ పరంగా జబర్ధస్త్ సంస్థతో కొన్ని విభేదాలున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. వచ్చే ఏపిసోడ్ నుండి కనపడనని ప్రకటించారు.