జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గురువారం శ్రీకాకుళం రణస్థలిలో ఏర్పాటు చేసిన యువశక్తి సభలో అధికార పార్టీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఏపీ ప్రభుత్వ వ్యవహార తీరుని తప్పుబడుతూ నిప్పులు చెరిగారు.
దీంతో వైసీపీ మంత్రులు, నేతలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు రీ కౌంటర్ లు వేస్తూ.. మూకుమ్మడి మాటల దాడి చేశారు. అదే సమయంలో నాగబాబు మరింత ఘాటుగా వ్యాఖ్యానిస్తూ ట్వీట్ చేశారు.
‘వైసీపీ పార్టీ మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు.. వాయినాలు ఇచ్చి పంపండి’ అని ట్వీట్ చేశారు.
దీంతో ఈ ట్వీట్ కాస్తా వైరల్ అయింది. మరోసారి సోషల్ మీడియా వేదికగా జనసేన పార్టీ నేతలు, వైసీపీ పార్టీ నేతల మధ్య వార్ మొదలైంది.
వై.సీ.పీ. @YSRCParty మగ ముత్తైదువలు మీడియా ముందుకొచ్చి మొరగడం మొదలు పెట్టారు…
వాయినాలు ఇచ్చి పంపండి !— Naga Babu Konidela (@NagaBabuOffl) January 12, 2023