జబర్ధస్త్ నుండి నాగబాబు జీకి వెళ్లిపోయారు. లోకల్ గ్యాంగ్ అనే ప్రోగ్రాంతో పాటు అదిరిందితో నాగబాబు హాల్‌చల్ చేస్తున్నారు. అయితే… ఎందుకంత సడన్‌గా నాగబాబు జబర్ధస్త్‌ను వీడిపోయారు, అక్కడెంత ఆఫర్ వచ్చి ఉంటుంది అన్న చర్చ ఇప్పుడు హాట్ టాపిక్. అయితే జబర్ధస్త్ కోసం నాగబాబుకు నెలకు 15లక్షలు ఇచ్చేవారని తెలుస్తోంది.
ఇప్పుడు కొత్త షోకు వెళ్లిపోవటంతో ఆ రెమ్యూనరేషన్ 30లక్షలకు చేరిందని తెలుస్తోంది. మీకు డబుల్ రెమ్యూనరేషన్ ఇస్తామనటంతో పాటు జబర్ధస్త్‌లోని కీలక డైరెక్టర్స్ కూడా వస్తుండటంతో నాగబాబు ఆ ఆఫర్‌కు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు షోకు వచ్చినప్పటి నుండి తిరిగి వెళ్లేవరకు అన్ని విధాలుగా వీఐపీ ట్రీట్‌మెంట్ ఉంటుందని, ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి రెమ్యూనరేషన్ పెంచబోతున్నారట.
అంతపెద్ద ఆఫర్ కనుకే నాగబాబు జంప్ చేశారన్న వార్త ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది.