ఇటీవల మెగా డాటర్ నిహారిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఉదయపూర్ ప్యాలెస్ లో మెగా కుటుంబ సభ్యుల మధ్య ఈ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అయితే ఇప్పుడు మెగా అభిమానులంతా వరుణ్ తేజ్ పెళ్లి కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నాగ బాబు, వరుణ్ ఎక్కడ కనిపించినా పెళ్లి ఎప్పుడు అంటూ అడిగేస్తున్నారు.
కాగా పెళ్లి విషయంలో వరుణ్ నిర్ణయానికే వదిలేసమని నాగబాబు సమాధానం ఇచ్చారు. అన్ని విధాలుగా అమ్మాయి వరుణ్ కు సెట్ అవుతుందా లేదా అనేది మాత్రమే చూస్తానని అంతే కాకుండా తమ కుటుంబంతో కలిసిపోయే తత్వం ఉండాలని నాగబాబు అన్నారు. అయితే ప్రస్తుతం వరుణ్ ఫోకస్ మొత్తం సినిమాలపైనే ఉందని పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడు అనేది మాత్రం తెలియదని చెప్పుకొచ్చాడు.