ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ అయిన నాగబాబు పవన్ కళ్యాణ్ కు కు సంబంధించిన కొన్ని ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇప్పటి వరకు ఎవరూ చూడని ఆ ఫోటోలను నాగబాబు ఇంస్టాగ్రామ్ ట్విట్టర్ లలో పోస్ట్ చేస్తూ ఉన్నాడు. ఇటీవల పవన్ కుర్రాతనంలో ఉన్న ఫోటోను పోస్ట్ చేసిన నాగ బాబు తాజాగా మరో ఫోటో పోస్ట్ చేశాడు.
ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫొటోలో తన తమ్ముడు పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్, నందమూరి నట సింహం బాలకృష్ణ కలిసి ఉన్న పాత ఫొటో. ఇద్దరు సోదరులు కలిసిన రోజు.. మొదటి వ్యక్తి నా సోదరుడు. రెండో వ్యక్తి మరో సోదరుడు.. నందమూరి సింహాన్ని పవర్‌స్టార్ కలిసిన రోజు అంటూ నాగబాబు కామెంట్ చేశారు.