నాగబాబు, జనసేన నేత
అమరావతిని రాజధానిగా ఉంచాలని గతంలో వైసీపీ ఒప్పుకుంది. అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి. కానీ.. వైసీపీ అధికారంలోకి రాగానే మూడు రాజధానులను తెరపైకి తీసుకొచ్చింది. అమరావతిని నిర్వీర్యం చేసేందుకు చూస్తోంది.
అమరావతి కోసం రైతులు చేస్తున్న ఉద్యమాన్ని వైసీపీ నేతలు అవహేళన చేశారు. హైకోర్టు తీర్పుతో చాలా సంతోషంగా ఉంది. ఇది ప్రజల విజయం. న్యాయం ఇంకా స్ట్రాంగ్ గా ఉందని మరోసారి రుజువైంది.
అమరావతి రైతులకు జనసేన మద్దతు ఎప్పుడూ ఉంటుంది. ఇప్పటికైనా ప్రజల రాజధానిని నిర్మించాలి. ఈ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లొద్దు. ఒకవేళ వెళ్లినా ఇలాంటి పరాభవమే ఎదురవుతుంది.
ఏ ప్రభుత్వమైనా ప్రజలతో శతృత్వం పెట్టుకోకూడదు. వైసీపీ సర్కార్ హైకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించాలి. రైతులకు ఇబ్బంది లేకుండా చూడాలి. రాజధాని ప్రాంత రైతులకు అభినందనలు.