పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంత కాదు. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా సోషల్ మీడియా లో రికార్డు లు నెలకొల్పిన సంగతి తెలిసిందే. తాజా పవన్ కు సంబంధించి ఓ ఫోటో వైరల్ గా మారింది. ఆ ఫొటోలో పవన్ కల్యాణ్ యువకుడిగా, నూనూగు మీసాలతో కనిపిస్తున్నారు. అభిమానులైతే ఈ ఫొటోని చెగువేరాతో పోలుస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ ఫొటో గురించి మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ.. ఇలాంటి ఫోటోలు చాలా ఉన్నాయి.., నా దగ్గర.. దాచానంతే… ! ఫరెవర్ బెస్ట్ బ్రదర్.. ఫరెవర్ లవ్.. పవన్ కల్యాణ్” అని పోస్ట్ చేశారు. దీంతో మెగాభిమానులు నాగబాబుకి రిక్వెస్ట్‌లు స్టార్ట్ చేశారు. దయచేసి వాటిని ఒక్కొక్కటిగా పోస్ట్ చేయండి సార్.. అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి అభిమానుల కోరికను నాగబాబు తీరుస్తాడో.. లేదో.. చూద్దాం.