ఉన్నది ఉన్నట్టు నిక్కచ్చిగా మాట్లాడుతూ.. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటారు సినీ నటుడు, జనసేన నేత నాగబాబు. తన మనసులోని మాటను నిస్సంకోచంగా వెల్లడించారాయన.
సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను పంచుకున్నారు బాబు. తాజాగా.. ఓ ఆసక్తికర ట్వీట్ చేశాడు. ఆయన చేసిన ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
‘మీరు మీ ప్రభుత్వ వ్యవహారాలపై ఆసక్తి చూపకపోతే.. మీరు మూర్ఖుల పాలనలో జీవించడం ఖాయం’ అని ట్వీట్ చేశారు. అయితే.. ఎవరిని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారనే విషయంలో నెటిజన్ లు హైరానా పడుతున్నారు.
ఈ విషయంలో పూర్తి క్లారిటీ లేనప్పటికీ.. వైసీపీ ప్రభుత్వాన్ని ఉద్దేశించే చేశారంటూ నెటిజన్లు భావిస్తున్నారు. ఇంకొందరు అయితే.. కొత్తగా ఎన్నికైన మంత్రుల్లో ఎవరికైనా ఇన్ డైరెక్ట్ గా జాగ్రత్తలు చెప్తున్నారేమో అంటూ కామెంట్లు పెడుతున్నారు.