నాగచైతన్య దూతగా మారాడు. కొత్త వెబ్ సిరీస్ ప్రారంభించాడు. పుకార్లు నిజం చేశాడు. అవును.. ఇన్నాళ్లూ గాసిప్స్ అనుకుంటున్న మేటర్ నిజమైంది. నాగచైతన్య ఓటీటీలోకి ఎంటరయ్యాడు. దూత టైటిల్ తో ఓ వెబ్ డ్రామా మొదలుపెట్టాడు. మహాశివరాత్రి సందర్భంగా ఈ వెబ్ డ్రామా షూటింగ్ మొదలైంది.
విక్రమ్ కుమార్ దర్శకత్వంలో దూత టైటిల్ తో వెబ్ సిరీస్ స్టార్ట్ చేశాడు. ఈ విషయాన్ని నాగచైతన్య అధికారికంగా ప్రకటించాడు. ఓ కొత్త ఆరంభం అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు.
హారర్ అంటే తనకు అస్సలు పడదని గతంలో చాలాసార్లు ప్రకటించాడు నాగచైతన్య. తను హారర్ సినిమాలు చేయనని కూడా చెప్పాడు. కానీ ఇప్పుడు అదే హారర్ జానర్ లో వెబ్ సిరీస్ మొదలుపెట్టాడు. ఈ సిరీస్ లో నాగచైతన్య లుక్ చాలా కొత్తగా, డిఫరెంట్ గా ఉండబోతోందని తెలుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్టుగా కొనసాగుతున్నాడు నాగచైతన్య. రీసెంట్ గా బంగార్రాజుతో హిట్ కొట్టాడు. అంతకంటే ముందు లవ్ స్టోరీతో సూపర్ హిట్ అందుకున్నాడు. కెరీర్ ఇలా పీక్ స్టేజ్ లో ఉన్న టైమ్ లో ఈ హీరో ఓటీటీలోకి ఎంటరవ్వడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది.