రాజధాని వికేంద్రీకరణ బిల్లుకు ఆమోదం తెలపటం పట్ల నగరి ఎమ్మెల్యే రోజా హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రజలు, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మూడు రాజధానులు అవసరమని నమ్మి జగన్మోహన్ రెడ్డి మూడు రాజధానుల బిల్లు తీసుకొచ్చారన్నారు రోజా. ఈ రోజు ఒక్క ఉత్తరాంధ్ర ప్రజలే కాదు రాయలసీమ, అమరావతి ప్రాంత రైతులు అందరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ఈ రోజు సొంతంగా లేనిది ఎవరన్నా ఉన్నారంటే అది నారా చంద్రబాబునాయుడు నారా లోకేష్ అండ్ కో బ్యాచ్ అని విమర్శించారు.
గతంలో అధికారాన్ని ఒక చోట వికేంద్రీకరణ చెయ్యటం వల్ల తెలంగాణ ఆంధ్ర విడిపోయాక దిక్కులేని పరిస్థితి లో పడ్డామని కానీ జగన్ నిర్ణయంతో భవిష్యత్ లో కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండవని కొనియాడారు.అలాగే అమరావతి ప్రజలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగదని, గత ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. ఇప్పటికైనా చంద్రబాబు లోకేష్ లు ఏడుపు ముఖాలు వేసుకుని ఇంట్లో ఉండాలని అలా కాకుండా బయటకు వచ్చి అభివృద్ధి ని అడ్డుకోవాలని చూస్తే ప్రజలు ఉరుకోరని హెచ్చరించారు.