ఆంధ్రప్రదేశ్ కు మూడు రాజధాలంటూ జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన బిల్లుపై నగరి వైసీపీ ఎమ్మెల్యే, APIIC చైర్‌పర్సన్ రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. బిల్లు పెట్టిన 14 రోజుల లోపు సెలెక్ట్ కమిటీ ఏర్పాటు చెయ్యకపోతే బిల్లు ఆమోదం పొందినట్టేనని తెలిపారు రోజా. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రోజా అనంతరం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, లోకేష్ పై విమర్శలు గుప్పించారు. మూడు రాజధానులు వ్యతిరేకంగా మాట్లాడుతున్న చంద్రబాబు ను ఉత్తరాంధ్ర, రాయసీమ ప్రజలు తరిమికొట్టాలన్నారు.
చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చెయ్యటం సిగ్గుమాలిన చర్య అంటూ విమర్శించారు. సోషల్ మీడియాలో లోకేష్ ఆద్వర్యంలో వైసీపీ పై చేస్తున్న దుష్ప్రచారంపై ఫిర్యాదు చేస్తే 80 శాతం మంది జైలులో ఉండేవారని హెచ్చరించారు. చంద్రబాబు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం ప్రయత్నం చేస్తుంటే జగన్ రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నాని తెలిపారు.