టాలీవుడ్ లో సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి, నందమూరి నటసింహం బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్. ఈ నలుగురిలో ఇద్దరు 100 సినిమాల మార్కు ను దాటేశారు. నాగ్, వెంకీ మాత్రం ఆ మార్కు క్రాస్ చెయ్యటంలో వెనుక పడ్డారు. అయితే ఇప్పుడు నాగార్జున ఆ మార్క్‌ను చేరుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే నాగ్ 100వ చిత్రంకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.
నాగ్ 100 వ చిత్రాన్ని తమిళ దర్శకుడు మోహన్ రాజా డైరెక్ట్ చేయనున్నారట. ప్రస్తుతం, ఈ దర్శకుడు మెగాస్టార్ తో “గాడ్ ఫాదర్” ను చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత నాగ్ 100 వ సినిమాపై కి రానున్నడట.
అన్నపూర్ణ స్టూడియోస్, జీ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మించే అవకాశం ఉందట. అలాగే నాగ్ చిన్న కుమారుడు అఖిల్ ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తాడట.
నాగార్జున తెలుగులో కేవలం 80 చిత్రాలకు పైగా చేశారు. అలాగే ఇతర భాషలలో కూడా నాగ్ సినిమాలు చేశారు. వాటన్నింటితో కలిపితే మూడంకెలకు దగ్గరపడ్డట్టే.
ఏది ఏమైనప్పటికీ, నాగార్జునకు 100 సినిమాలు ఒక పెద్ద ఫీట్. కాబట్టి ఖచ్చితంగా తన కెరీర్‌లో ఇది మరపురాని చిత్రంగా ఉండాలని కోరుకుంటాడు. మరి ఏం జరుగుతుందో చూడాలి.