హైదరాబాద్: కింగ్ నాగ్ షష్టిపూర్తి జరుపుకున్నారా? టాలివుడ్ మన్మధుడికి అప్పుడే అరవై ఏళ్లు వచ్చేశాయా.? ఫాన్స్ నమ్మలేకపోతున్నప్పటికీ ఇది నిజం నాగార్జున అక్కినేని తన అరవయ్యవ పుట్టినరోజును హ్యాపీగా జరుపుకొన్నారు. ఈవిషయం తెలిసి సినీ, రాజకీయ ప్రముఖులతోపాటు అక్కినేని అభిమానులు సోషల్‌మీడియా వేదికగా కింగ్ నాగార్జునకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. నాగ్ ఇంటి కోడలు సమంత ఇన్‌స్టా వేదికగా మామగారికి గ్రీటింగ్స్ చెప్పింది. నాగ్ స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న ఫొటోను షేర్ చేసింది.
‘మీతో పాటు మీ పక్కన ఉన్నవాళ్లందరూ ఎప్పుడూ సంతోషంగానే ఉంటారు. అది మీ గొప్పదనం. మీరు వయస్సును కూడా ఓడించారు మామా.. హ్యాపీ బర్త్‌డే కింగ్ నాగ్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. కుటుంబసభ్యులతో కలిసి దిగిన మరో ఫొటోను ఈ పోస్టులో యాడ్ చేశారు. నాగార్జున కుటుంబసభ్యులతో కలిసి స్పెయిన్‌లో ఈ పుట్టినరోజు వేడుక చేసుకున్నారు. ఈ టూర్‌కి సంబంధించి సమంత పోస్ట్ చేసిన కొన్ని ఫొటోలు సోషల్‌మీడియాలో బాగా వైరల్ అయ్యాయి.
నాగార్జున, రకుల్ జంటగా నటించిన మన్మథుడు-2 చిత్రం ఇటీవల విడుదలయ్యింది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అతని కోడలు సమంత గెస్టు రోల్‌లో అలా మెరిసి అలా మాయమవుతారు.