ఎన్నికల ప్రచారంలో ప్రభుత్వ ఉద్యోగులు ఏ రకంగా పాలుపంచుకోకూడనే కఠిన నిబంధనలు ఉన్నా.. టీఎన్జీవో నేతలు వాటిని తుంగలో తొక్కుతున్నారు. నాగార్జున సాగర్ ఉప ఎన్నిక వేళ.. నియోజకవర్గంలోనే తిష్టవేసి అధికార పార్టీకి అనుకూల ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వం ఇటీవల చేసిన పీఆర్సీ ప్రకటనకు కృతజ్ఞత తెలిపే పేరుతో.. యధేచ్చగా ఎన్నికల నియమావళిని అతిక్రమిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశాలు నిర్వహించి టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలంటూ కోరుతున్నారు. ఈ క్రమంలోనే నిబంధనలు అతిక్రమించిన టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షుడు మామిళ్ల రాజేందర్‌పై నాగార్జునసాగర్ పోలీస్టేషన్‌లో కేసు నమోదైంది.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించి విజయ్ విహార్ ప్రభుత్వ పర్యాటక అతిథి గృహంలో ప్రభుత్వ ఉద్యోగులతో సమావేశం నిర్వహించిన రాజేందర్.. వారందరినీ ప్రలోభాలకు గురి చేశారు. టీఆర్ఎస్‌కు అనుకూలంగా ఓటు వేయాలంటూ కోరారు. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు TNGO రాష్ట్ర అధ్యక్షుడు రాజేందర్ తో పాటు TNGO జిల్లా అధ్యక్షుడు మరియు సాగర్ స్థానిక TNGO నేతలపై కేసు నమోదు చేశారు. ఎన్నికల నియమావళిని ఉల్లంఘించిన TNGO నేతలను సస్పెండ్ చేసే చర్యల్లో ఎన్నికల సంఘం నిమగ్నమైనట్టు తెలిసింది.