చిరంజీవి రాజకీయాల గురించి అందరికీ తెలుసు. మరి నాగార్జున సంగతేంటి? ఆయన కూడా రాజకీయాల్లోకి వస్తున్నాడా? లేక ఓ పార్టీకి మద్దతిస్తాడా? ఏపీ, తెలంగాణలో ఎన్నికల ఫీవర్ ఊపందుకున్న వేళ, నాగార్జునకు ఈ ప్రశ్న ఎదురైంది. దీనిపై సూటిగా సుత్తిలేకుండా స్పందించాడు నాగ్.
“నాకు రాజకీయాలు పడవు. ప్రస్తుతం హాయిగా ఉన్నాను. ఇక సినిమాలో రాజకీయాల విషయానికొస్తే, మంచి స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా పొలిటికల్ సినిమా చేస్తాను. కాకపోతే ఆ సినిమా నన్ను ఎలాంటి వివాదాల్లోకి లాగకుండా ఉండాలి. అలాంటి వివాదాలకు దూరంగా ఓ పొలిటికల్ స్క్రిప్ట్ దొరికితే తప్పకుండా చేస్తాను.”
ఇలా రాజకీయాలపై, రాజకీయ నేపథ్యంలో చేసే సినిమాలపై పూర్తి స్పష్టత ఇచ్చాడు నాగార్జున. ది ఘోస్ట్ సినిమాతో థియేటర్లలోకి వచ్చిన ఈ సీనియర్ హీరో, ఇకపై తన నుంచి రెగ్యులర్ మాస్ మాసాలా సినిమాలు రావని, మంచి క్యారెక్టరైజేషన్ తో, పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో మాత్రమే వస్తాయని చెబుతున్నాడు.