అక్కినేని నాగార్జున సినిమాల్లో సంతోషం సినిమా సూపర్ హిట్. నాగార్జున కు 2000 నుంచి 2005 వరకు మంచి టైం నడిచింది. ఏ సినిమా చేసినా సరే దాదాపుగా హిట్ అయ్యాయి. మన్మధుడు, సంతోషం, మాస్ వంటి సినిమాలు ఆయనకు మంచి హిట్స్ గా నిలిచాయి. అదే టైం లో వచ్చిన శివమణి సినిమా నాగార్జున లో మరో కోణం చూపించింది.
Also Read:నాగార్జున కొడుకు ఇప్పుడు ఎలా ఉన్నాడో తెలుసా…?
ఇక సంతోషం సినిమా సూపర్ హిట్ కావడంతో నాగార్జునతో సినిమాలు చేయడానికి చాలా మంది ఎదురు చూసారు. 2002 లో వచ్చిన సంతోషం సినిమాలో ఒక పాట అయితే ప్రేక్షకుల కళ్ళల్లో అలా ఉండిపోయింది. సోడాబుడ్డి కళ్ళ అద్దాలతో లడ్డుగా కనిపించే ఒక బుడ్డోడి పాత్ర అది. ఆ సినిమాలో నాగార్జున కు కొడుకుగా నటించి మెప్పించాడు. ఈ సినిమాలోనే కాకుండా అప్పుడు వచ్చిన చాలా సినిమాల్లో సీరియల్స్ లో కనిపించాడు.
ఒక హింది సినిమాలో బుడ్డోడి నటన చూసి నాగార్జున ఫిదా అయిపోయారు. దీనితో సంతోషం సినిమాలో అతనికి అవకాశం ఇచ్చారు. ఆ పిల్లాడి పేరు అక్షయ్ బచ్చు. ఆ సినిమాల తర్వాత తెలుగు సినిమాలకు గుడ్ బై చెప్పి చదువు మీద ఫోకస్ చేసాడు. బాలీవుడ్ లో నటిస్తున్న ఈ అబ్బాయి… అక్కడ పలు సీరియల్స్, సినిమాల్లో నటిస్తున్నాడు. 12 సినిమాల్లో బాలీవుడ్ లో బాల నటుడిగా చేసాడు.
Also Read:‘ నల్లమల’ లో ఏముంది ? రివ్యూ