ఆరుపదుల వయసులో కూడా మన్మథుడిగా ప్రేక్షకులను మెప్పించటానికి ప్రయత్నంచేసి పరాజయం చవిచూసిన హీరో అక్కినేని నాగార్జున. మొన్నటి వరకు బిగ్ బాస్ షో తో బిజీ బిజీ గా గడిపిన ఈ సీనియర్ హీరో ఎలాంటి కథతో వస్తాడోనని అక్కినేని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఇటీవల లవర్ బాయ్ గా మన్మథుడు 2 సినిమా తో వచ్చి థియేటర్లలో బోల్తా కొట్టడమే కాకుండా విమర్శలు పాలయ్యారు నాగ్.
అభిమానులను ఎంతో నిరాశ పరిచిన నాగ్ ఈ సారి మంచి కథతో రావాలని డిసైడ్ అయ్యాడు. ఒక విదంగా చెప్పాలంటే మన్మథుడు 2 సినిమా తరువాత బంగార్రాజు సినిమా తియ్యాలి. కానీ మన్మథుడు 2 పరాజయం తో నాగ్ వెనక్కి తగ్గిపోయాడు. యాక్షన్ మూవీతో వచ్చిన హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్న ఈ సీనియర్ హీరో సోలోమెన్ అనే కొత్త దర్శకుడు చెప్పిన కథ నచ్చి ఆయనతో సినిమా చేయబోతున్నాడు. ఈ చిత్రంలో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. గతంలో పోలీస్ ఆఫీసర్ గా నాగ్ చేసిన సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మరి ఈ సారి నాగ్ ఏ మేర ఆకట్టుకుంటాడో చూడాలి.