హీరోయిన్ సమంత అక్కినేని నాగార్జున వారసుడు అక్కినేని నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన తర్వాత కూడా సమంత తన జోష్ తగ్గకుండా సినిమాలను చేస్తుంది. అదే విధంగా కథలో కొత్తదనం లేకపోతే కూడా ఒప్పుకోవట్లేదు.
ఇదిలావుంటే ఇటీవల ఈ అమ్మడు సోషల్ మీడియాలో కాస్త హాట్ హాట్ గా ఫోటోలు పెడుతుంది. అవి చూసిన నెటిజన్ లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. సమంతకు పెళ్లి అయిన విషయం మరిచిపోయిందా అంటూ విమర్శలు కూడా చేస్తున్నారు. అక్కినేని కుటుంబానికి కోడలిగా వెళ్లి ఇలా చేయడం పట్ల మండిపడుతున్నారు.
అయితే ఇదే విషయమై నాగార్జున క్లాస్ పీకాడని తెలుస్తోంది. సినిమాలు, వెబ్ సిరీస్ లో నటించినా పర్వాలేదు… కానీ ఇలాంటి ఫోటో షూట్ లకు దూరంగా ఉండాలని కాస్త గట్టిగా హెచ్చరించినట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి నాగ్ వార్నింగ్ కు సమంత తగ్గుందా లేక తన తీరు కంటిన్యూ చేస్తుందా అనేది చూడాలి.