అక్కినేని నాగార్జున…ఆరుపదుల వయసు మీద పడుతున్నా ఎంతో గ్లామర్ గా కనిపిస్తుంటారు. ఇప్పుడు యంగ్ హీరోలకు పోటీగా యాక్షన్ సన్నివేశాలకు కూడా సిద్ధం అవుతున్నారు నాగార్జున. ఆఫీసర్, మన్మధుడు2 సినిమాల పరాజయం తరువాత కథలను ఎంచుకునే విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నడాట నాగ్.
తాజాగా కొత్త దర్శకుడు సోలమన్ చెప్పిన కథకు నాగార్జున ఓకే చెప్పారు. ఈ సినిమాలో నాగ్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఆద్యాంతం యాక్షన్ సన్నివేశాలతో… కాప్ చేపట్టే ఆపరేషన్ నేపథ్యంలో సాగనుందని సమాచారం. అయితే యాక్షన్ సన్నివేశాల కోసం హాలీవుడ్ స్టంట్ మాస్టర్లను సైతం నాగ్ బరిలో దించుతున్నారట. యాక్షన్ సన్నివేశాల్లో వెనక్కి తగ్గే ఆలోచన చేయవద్దని డైరెక్టర్ కు కూడా చెప్తున్నాడట నాగ్.
జనవరిలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి, వేసవిలో సినిమా రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో చిత్ర యూనిట్ ఉంది. మొదట సోగ్గాడే చిన్నినాయనా సినిమా సిక్వెల్ గా సినిమాని తెరకెక్కించాలని భావించినా… ఇప్పటికే వరుస సినిమాలు బోల్తా కొట్టడంతో ఆ సినిమాకి బ్రేక్ వేశాడు. ఇక నాగ్ పై కొందరు ఈ సినిమా విషయంలో సెటైర్లు వేస్తున్నారు. వయసు కు తగ్గ సినిమాలు చెయ్యకుండా కొత్త కొత్తగా ట్రై చేస్తూ విమర్శల పాలవుతున్నారని, వెంకటేష్ లా ఫ్యామిలీ ఆడియోన్స్ ను మెప్పించే కథలు చేసుకోవచ్చు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.