ఉగ్రవాద కథాంశంతో వచ్చిన సినిమాలేవయినా… కాస్త మెరుగ్గా ఉంటే చాలు బొమ్మ హిట్టు అనే టాక్ వచ్చేసింది. అలాంటి ప్రయత్నంతోనే నాగార్జున వైల్డ్ డాగ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముందుగా ఓటీటీలో సినిమా రిలీజ్ చేయాలని భావించినప్పటికీ… థియేటర్లు ఓపెన్ కావటంతో నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని బిగ్ స్క్రీన్ పై సందడి చేశారు.
పుణేలో ఓ బాంబ్ బ్లాస్ట్… ఖలీద్ అనే ఉగ్రవాది… అతన్ని పట్టుకునేందుకు ఎన్.ఐ.ఏ విజయ్ వర్మ అనే అధికారిని అపాయింట్ చేస్తుంది. తన టీంతో నాగ్ చేసే ఆపరేషనే ఈ వైల్డ్ డాగ్. పుణే నుండి నేపాల్ వయా ముంబై మీదుగా సాగే కథలో విజయ్ వర్మగా నాగ్ సక్సెస్ అవుతాడా అన్నదే సినిమా.
ఉగ్రవాదిని గుర్తించే సీన్స్ పెద్దగా ఆకట్టుకోకపోయినా… ఖలీద్ తప్పించుకునే సీన్స్ , ఛేజింగ్ సీన్స్ బాగుంటాయి. అయితే సెకండ్ ఆఫ్ అంతా నేపాల్ బేస్ గా సాగుతుంది. అక్కడ వైల్డ్ డాగ్ టీంపై దాడి జరగటం, వారిని గుర్తించే సన్నివేశాలు… అవసరమా అనిపిస్తాయి. పైగా పెద్ద ఉగ్రవాది సెక్యూరిటీ లేకుండా పెళ్లిళ్లలకు తిరిగే సీన్ నమ్మశక్యంగా ఉండదు. ఇక క్లైమాక్స్ సీన్ బాగుంటుంది. కానీ బేబీ సినిమా చూసిన వారికి మాత్రం పాత క్లైమాక్సే కదా అనుకోవటం ఖాయం. ఉగ్రవాదిని పట్టుకునే అంశంలో ఉండే ప్రత్యేకత సినిమాలో పెద్దగా ఉండదు.
నాగ్ కూడా ఇంకాస్త సీరియస్ గా ఉండాల్సింది. కానీ అలీరాజా కు ఈ సినిమా నుండి మంచి గుర్తింపు వస్తుందని మాత్రం చెప్పుకోవచ్చు. ఇక సినిమాకు థమన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగా ఆకట్టుకుంటుంది. డైరెక్టర్ సోలోమాన్ మంచి జానర్ ఫిల్మ్ ఎంచుకున్నా… డైరెక్షన్ పై ఇంకాస్త ఫోకస్ పెంచాలి. అయితే, హీరోయిజం, బిల్డప్స్, లెక్చర్ల జోలికి పోకపోవటం మంచి అంశంగా చెప్పుకోవచ్చు.