నాగ్ పక్కన ఒకరు.. నానితో మరొకరు..

నాగార్జున- నాని మల్టీస్టారర్ షూట్ స్పీడందుకుంది. రీసెంట్‌గా రామోజీ ఫిల్మ్‌సిటీలో ఈ ప్రాజెక్ట్ చిత్రీకరణ జరిగింది. తాజాగా ఫిల్మ్‌నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు.. నాని పక్కన హీరోయిన్‌గా శాండిల్‌వుడ్ బ్యూటీ, ‘కిరాక్ పార్టీ’తో స్టార్ హీరోయిన్‌గా క్రేజ్ సంపాదించుకున్న రష్మిక మడన్నను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది.

ఇక నాగార్జున పక్కన ‘మళ్లీ రావే’ ఆకాక్ష సింగ్‌ని సెలక్ట్ చేసినట్టు ఇన్‌సైడ్ సమాచారం. వీళ్ల పేర్లను త్వరలోనే యూనిట్ ప్రకటించనుంది. శ్రీరామ్ ఆదిత్య డైరెక్ట్ చేస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వనీదత్ నిర్మిస్తున్నాడు. ఓ హాలీవుడ్ మూవీ ఆధారంగా దీన్ని తెరకెక్కిస్తున్నట్లు టాక్. నాని డాక్టర్ రోల్‌లో కనిపిస్తాడని యూనిట్ చెబుతున్నమాట.