‘రెండో సోగ్గాడు’ లేనట్టే!

‘సోగ్గాడు చిన్నినాయన సీక్వెల్’ ఎంతవరకు వచ్చింది. ఈ ప్రాజెక్ట్ తర్వాత నాగార్జున వరసగా రెండు చిత్రాలకు కమిట్ కావడంతో అక్కినేని అభిమానుల్లో అనుమానాలు మొదలయ్యాయి. ఇంతకీ సోగ్గాడు సీక్వెల్ వున్నట్టా? లేనట్టా? అంటూ ప్రశ్నలు రైజ్ చేస్తున్నారు. మూడేళ్ల కిందట నాగార్జున- కల్యాణ్‌కృష్ణ కాంబినేషన్‌లో సంక్రాంతికి వచ్చింది ‘సోగ్గాడే చిన్ని నాయన’. ఫ్యామిలీతోపాటు మాస్ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది ఈ చిత్రం. ఇదే క్రమంలో సీక్వెల్‌కి ప్లాన్ చేసినట్టు వార్తలొచ్చాయి.

ప్రస్తుతం ఆ ప్రాజెక్ట్ వెనక్కి వెళ్లినట్టు ఫిల్మ్‌నగర్ సమాచారం. దీనికి సంబంధించి రెడీ చేసిన స్ర్కిప్ట్‌ని డైరెక్టర్ పలుమార్లు మార్చినప్పటికీ.. నాగ్ కన్విన్స్ కాలేదని, ఈ క్రమంలో వెనక్కి వెళ్లిందని అంటున్నారు. ప్రస్తుతం నాగ్.. ఆఫీసర్, మల్టీస్టారర్ చిత్రాలతో బిజీ కాగా, కల్యాణ్‌కృష్ణ.. రవితేజతో ఫ్యామిలీ ఎంటర్‌టైన్ చేస్తున్నాడు.