మీ ఇంటికి పెద్ద కొడుకులా.. పేదల పక్షపాతిగా నిలుస్తానని దేవుడి ముందు ప్రమాణం చేశాను… ప్రతి ఏడాది మాదిరిగానే 165 నూతన నిరుపేద జంటలకుసామూహిక వివాహలు చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి. నా ఆర్థిక స్తోమత సరిగ్గా లేని సమయంలో నేను నమ్మిన దేవుడు శ్రీ లక్ష్మి నర్సింహ స్వామి సన్నిధిలో నా చెల్లి పెండ్లి చేశాను… ఇప్పుడు ఓ అన్నగా ఈనెల 27 నుండి మూడు రోజుల పాటు సాముహిక వివాహాలు దైవ సన్నిధిలో జరిపిస్తానని తెలిపారు.
165 జంటలకు వివాహం జరగుతుందని.. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా దరఖాస్తు చేసుకునే నిరుపేద జంటలకు పెళ్లి చేసిస్తానని ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ప్రకటించారు.