డిఫరెంట్ కథలను ఎంచుకుని సక్సెస్ లను సాధిస్తున్నాడు యంగ్ హీరో నాగ శౌర్య. ప్రస్తుతం నాగ శౌర్య స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో లక్ష్య సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు వరుడు కావలెను అనే సినిమాతో కూడా నటిస్తున్నాడు. అయితే తాజా సమాచారం ప్రకారం మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నాగశౌర్య నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమాలో అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ కీలకపాత్రలో నటించబోతున్నాడు. సీనియర్ నిర్మాత కృష్ణ ప్రసాద్ నిర్మాతగా శ్రీమాన్ వేముల దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.
తాజా సమాచారం మేరకు ఈ సినిమాలో నాగశౌర్య ఛాలెంజింగ్ రోల్ లో కనిపించనున్నారట. మాటలు మాట్లాడ లేని చెవులు వినపడని యువకుడి పాత్రలో నాగశౌర్య కనిపిస్తారట. అయితే ఇప్పటి వరకు ఈ విషయమై అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.