• Skip to main content
  • Skip to secondary menu
  • Skip to primary sidebar
tolivelugu-logo-removebg-preview

Tolivelugu తొలివెలుగు

Tolivelugu News provide Latest Breaking News (ముఖ్యాంశాలు), Political News in Telugu, TG and AP News Headlines Live (తెలుగు తాజా వార్తలు), Telugu News Online (తెలుగు తాజా వార్తలు)

tolivelugu facebook tolivelugu twitter tolivelugu instagram tolivelugu tv subscribe nowtolivelugu-app
  • తెలుగు హోమ్
  • వీడియోస్
  • రాజకీయాలు
  • వేడి వేడిగా
  • ఫిలిం నగర్
  • E-Daily
  • చెప్పండి బాస్
  • ENGLISH
Tolivelugu Latest Telugu Breaking News » Local News » నాగోబా జాతర.. తరలివస్తున్న ఆదీవాసీలు

నాగోబా జాతర.. తరలివస్తున్న ఆదీవాసీలు

Last Updated: January 21, 2023 at 1:39 pm

ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు అంతా సిద్ధమయ్యింది. శనివారం అర్థరాత్రి మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ వేడుక కోసం మెస్రం వంశీయులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఒకే చోటుకు.. మూడు రాష్ట్రాల ఆదివాసీలను చేర్చే జాతర నాగోబా. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్​గఢ్​ నుంచి ఆదివాసీలు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.

తెలంగాణ: ప్రముఖ గిరిజన జాతర 'నాగోబా' - VSK Telangana

కాలినడకన 80 కిలో మీటర్ల దూరంలోని జన్నారం మండలంలోని కలమడుగు హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గోదావరి జలాన్ని పుష్య అమావాస్యకు ఒకరోజు ముందు కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద ఉంచుతారు. అనంతరం నాగ దేవునికి గంగా జలంతో అభిషేకం చేస్తారు. పుష్యమాసపు అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ ‌లో మాత్రం దేదీప్యమానమైన వెలుగుల మధ్య ఈ జాతర మొదలవుతుంది.

చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు. నాగోబా జాతర చివరి రోజు జరిగే దర్బార్ ​తో జాతర ముగుస్తుంది. జాతరకు నలుమూల నుంచి వేల సంఖ్యలో వస్తున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో దర్బార్ ఏర్పాటు చేస్తారు.

ఈనెల 24న కలెక్టర్ సిక్తా పట్నాయక్​ అధ్యక్షతన దర్బార్​ ని నిర్వహించనున్నారు. ఈ దర్బార్ కి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరవుతారు. దీని కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఏటా దర్బార్ లో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.

Primary Sidebar

తాజా వార్తలు

ఈ బామ్మ డ్యాన్స్ అదుర్స్…వీడియో వైరల్..!

అన్ని తరాల వారు చూడాల్సి సినిమా ఇది: కృతి!

ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి: చిన్మయి!

భోళా శంకర్ మరో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌!

చంద్రముఖి 2 షూటింగ్ కంప్లీట్..రిలీజ్ ఎప్పుడంటే!

కునో పార్క్ లో ఛీతాల మృతి.. ఇక నమీబియాలో అధికారుల స్టడీ !

సాంకేతిక లోపంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌!

దక్షిణాది రాష్ట్రాలకు కొత్త డీలిమిటేషన్ తో అన్యాయం!

అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మారింది: కేంద్ర మంత్రి!

టీఎస్పీఎస్సీలో..చాట్ జీపీటీ!

సిసోడియా బెయిల్ పిటిషన్ తిరస్కరణ

సీఎంని చేయండి..150 ఏళ్లు బతకండి!

ఫిల్మ్ నగర్

adipurush is a must watch movie kriti sanon commments

అన్ని తరాల వారు చూడాల్సి సినిమా ఇది: కృతి!

chinmayi wants mk stalin to takeaction against vairamuthu

ముందు ఆయన మీద చర్యలు తీసుకోండి: చిన్మయి!

bhola sankar movie sankar dada mbbs shade

భోళా శంకర్ మరో శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌!

Chandramukhi 2 shooting complete..When is the release!

చంద్రముఖి 2 షూటింగ్ కంప్లీట్..రిలీజ్ ఎప్పుడంటే!

if people made me cm then i will reveal truth to live 150 years sarath kumar

సీఎంని చేయండి..150 ఏళ్లు బతకండి!

power star pawan kalyan shoe cost is trending in social media

పవన్ వేసుకున్న షూ ధర ఎంతంటే!

సీతారాముల ఎడబాటు పాటగా...ఆదిపురుష్ న్యూసాంగ్..!

సీతారాముల ఎడబాటు పాటగా…ఆదిపురుష్ న్యూసాంగ్..!

SreeLeela in an international Movie

ఇంటర్నేషనల్ సినిమాలో శ్రీలీల

Download Tolivelugu App Now

tolivelugu app download

Copyright © 2023 · Tolivelugu.com

About Us | Disclaimer | Contact Us | Feedback | Advertise With Us | Privacy Policy | Sitemap | News Sitemap