శ్రీనివాస్ గౌడ్ హత్యకు కుట్ర జరిగిందని పోలీసులు చేసిన వ్యాఖ్యలను నాగరాజు భార్య ఖండించింది. తప్పుడు కేసులు పెట్టి తమను వేధిస్తున్నారని వాపోయింది. ఫిబ్రవరి 23న పోలీసులు తీసుకువెళ్లిన వ్యక్తి.. 25న పేట్ బషీరాబాద్ లో దాడి ఎలా చేస్తాడని ప్రశ్నించింది.
ఫరుక్, హైదర్ ఆలీలకు సుపారీ ఇస్తే.. తీసుకున్నవాళ్లు కూడా నిందితులే అవుతారని తెలిపింది నాగరాజు భార్య. వాళ్ళు బయట ఎందుకు తిరుగుతున్నారని పోలీసులను నిలదీసింది.వారిద్దరిని కూడా అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తోంది.
రోడ్లపై కత్తులతో దాడి అని సైబరాబాద్ సీపీ స్టీఫెన్ అంటున్నారు..అంత పెద్ద సిటీలో అడుగడుగునా సీసీ కెమెరాలు ఉంటాయని..ఆ దృశ్యాలను బయట పెట్టాలని డిమాండ్ చేసింది.15 కోట్లు ఇచ్చే స్తోమత తమకు ఉందో లేదో పోలీసులే విచారణ జరపాలని చెబుతోంది.
ప్రభుత్వం, పోలీసులపై తమకు నమ్మకం లేదని.. సీబీఐతో విచారణ చేసి న్యాయం చేయాలని కోరుతోంది.