బీజేపీ నేతల భార్యలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యపై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. చిరుమర్తి లింగయ్య ఇంటిని బీజేపీ శ్రేణులు ఈ రోజు ముట్టడించాయి. ఆయన ఇంటి ముందు బీజేపీ మహిళా నేతలు ధర్నా చేశారు.
అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్సీ కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను ఖండిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. బీజేపీ నేతల భార్యలను ముద్దు పెట్టుకుంటే మీరు ఊరుకుంటారా అంటూ వ్యాఖ్యలు చేశారు.
దీనిపై బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఈ రోజు బీజేపీ మహిళా నేతలు చిరుమర్తి లింగయ్య ఇంటిని ముట్టడించారు. ఎమ్మెల్యే బయటకు రావాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే బయటకు వచ్చి ముద్దులు పెట్టాలంటూ ఆందోళన చేశారు.
ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటి వద్ద ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకున్నారు. బీజేపీ మహిళా నేతలను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.