నక్కా ఆనంద్ బాబు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు
మా నాయకుడు ఇంటిపై దాడికి వచ్చిన వారి మీద కేసు పెట్టమని డీజీపీ ఆఫీస్ కి వెళ్తే తిరిగి మాపైనే కేసులు పెట్టారు. అన్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్ కి వెళ్తే తిరిగి కేసులు పెట్టడం ఏంటి..? రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు అన్ని ప్రజలు గమనిస్తున్నారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగంలో జరిగే నిరంతర ప్రక్రియలా ఉంది. ఇంత చేసి సమర్దించుకోవడం సిగ్గుచేటు. మాకే ఇలా ఉంటే మరి సామాన్యుల పరిస్థితి ఏంటి..? అంబేద్కర్ రాజ్యాంగంలో ఇచ్చిన హక్కులను కాల రాస్తున్నారు.
20 కార్లతో మందీమార్బలంతో జోగి రమేష్ రెండు చెక్ పోస్టులు దాటుకుని వచ్చారు. ఈ రాష్ట్రంలో ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉందా..? పైగా జోగి రమేష్ డ్రైవర్ చేత మా కార్యకర్తలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టిస్తారా..? ప్రతిపక్ష నాయకుడి దగ్గరకి వెళ్లి నువ్వు చెప్పేది ఏంటి జోగి రమేష్..? చేతగాని ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకొని తప్పుడు కేసులు పెడతానికి సిగ్గుండాలి. ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు వేస్తే మేము కోర్టుకి వెళ్లాం. ఇప్పుడు చెప్తున్నాం.. డీజీపీ కార్యాలయానికి వైసీపీ రంగులు వేసుకోండి మేము కోర్టుకి వెళ్లం. డీజీపీ ఆఫీసు వైసీపీ కార్యాలయంలా మారింది.
హోంమంత్రి మీద ఎదో ప్రేమ ఉన్నట్లుగా మాట్లాడుతున్నారు. ఒక హోంమంత్రికి ఎప్పుడైనా మర్యాద ఇచ్చారా..? జిల్లాకి ఏకైక మంత్రి.. కానీ ఓపెనింగ్ లు అన్ని ప్రభుత్వం నుండి జీతం తీసుకునే సజ్జల రామకృష్ణారెడ్డి చేత చేయిస్తారు. నగరంలో కనీసం ఫ్లెక్సీలలో కూడా ఆమె ఫోటో వేయకుండా అవమానిస్తున్నారు. ఇది వివక్ష కాదా..? వైసీపీ నాయకులు బూతులు ఎన్ని ఎక్కువ తిడితే వాళ్ల భవిష్యత్ అంత బాగుంటుందని అనుకుంటున్నారు. ఎన్నిసార్లు కోర్టులు చివాట్లు పెడుతున్నా సిగ్గు అనిపించడం లేదు ప్రభుత్వానికి. రోజులు అన్నీ ఒకేలా ఉండవు.