మరో ఆర్టీసీ కార్మికుడు ప్రాణాలు విడిచాడు. నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి డిపో కి చెందిన వెంకటేశ్వర్లు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. నార్కెట్ పల్లి లారీ అస్సోసియేషన్ కార్యాలయం సమీపం లో ఉన్న పెట్రోల్ బంక్ వద్ద అతని మృతదేహం లభ్యం అయింది. వెంకటేశ్వర్ లు మృతి పలు అనుమానాలకు దారితీస్తుంది. ఘటన స్థలానికి చేరుకున్న పోలీస్ లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించాలని ఆర్టీసీ కార్మికులు 22 రోజులుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.