అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఆ దేశంలో నల్లజాతీయుడు వ్యక్తి జరిపిన కాల్పుల్లో నలుగురు భారతీయులు మరణించినట్టు అమెరికా అధికారులు వెల్లడించారు. కాల్పుల్లో మరణించిన నలుగురు భారతీయుల్లో ఉమ్మడి నల్గొండ జిల్లా వాసి మృతి చెందినట్టు అధికారులు తెలిపారు.
కాల్పుల్లో గాయపడిన అతన్ని యూనివర్శిటీ ఆప్ మేరీల్యాండ్ ఆడమ్స్ కౌలీషాక్ ట్రామా సెంటర్ లోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స తర్వాత సాయి చరణ్ మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు.
నల్గొండ జిల్లాకు చెందిన నక్కా సాయి చరణ్ రెండేళ్లుగా సాయి చరణ్ అమెరికాలో టెక్కీగా పనిచేస్తున్నాడు. ఇటీవల తన స్నేహితున్ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసేందుకు వెళ్లాడు. అతన్ని ఎయిర్ పోర్ట్ లో డ్రాప్ చేసి తిరిగి వెళ్తున్న సమయంలో అతను ప్రయాణిస్తున్న కారుపై నల్ల జాతీయుడు కాల్పులు జరిపాడు.
ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన సాయి చరణ్.. స్థానికులు ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ చరణ్ మృతి చెందినట్టు అక్కడి అధికారులు వెల్లడించారు. దీంతో మృతుని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు అమెరికా అధికారులు. దీంతో నల్గొండ జిల్లాలో విషాద ఛాయలు అలుముకున్నాయి.