నల్లమల యురేనియం
వ్యతిరేక జేఏసి నాసరయ్య
నల్లమలకు యురేనియం, ఫారెస్ట్ అధికారుల నుంచి ప్రమాదం పొంచి ఉంది. ఈ ప్రమాదము నుండి నల్లమలను కాపాడుకోవడానికి ప్రజలందరూ ఏకం కావాల్సిన అవసరం ఉన్నది. నల్లమలకు ఫారెస్ట్ అధికారుల నుండే ఎక్కువ ప్రమాదం పొంచి ఉంది. నల్లమల ప్రాంతములో ఫారెస్ట్ అధికారులు గాని ఫారెస్ట్ ఆఫీస్ లను ఎత్తివేయాలన్న డిమాండు తీసుకోద్దాము. ఫారెస్ట్ రక్షక భటులు పోయి భక్షక భటులుగా మారినారు.
అందుకే మన నల్లమలను మనమే కాపాడుకుందాము. ఎన్నో ప్రజాపోరాటాలకు తలొగ్గిన తెలంగాణ ప్రభుత్వం యురేనియంను నల్లమల్ల లోనే కాదు తెలంగాణ జిల్లాలలో యురేనియం తవ్వకాలు గానీ సర్వే లు కానీ జరుపబోమని అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసినది. గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు అంతటితో ఆగకుండా కేంద్రము దుస్సాహసం చేసి యురేనియం తీయడానికి ప్రయత్నిస్తే అందరం కలిసి కేంద్రంతో పోరాటం చేద్దామని అసెంబ్లీలో చెప్పడం జరిగింది.
కానీ అసెంబ్లీ తీర్మానం చేసిన పది రోజుల్లోనే ఒక జెట్టు విమానం నల్లమలను అణువణువు నల్లమలను గాలించి స్కానింగు తీయడం జరిగింది. నల్లమల ప్రజలు చాలా భయాందోళనకు గురైనారు ఆ సమయంలో ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక ఎంపీ పార్లమెంటులో మాట్లాడుతు నల్లమలలో యురేనియం తవ్వకాలు జరుపబోతున్నారా అని పార్లమెంటులో అడిగిన ప్రశ్నకు ఆనాటి కేంద్ర అటవీ శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ మాట్లాడుతూ నల్లమలలో యురేనియం తవ్వకాలు జరపడం లేదని కానీ తెలంగాణ ప్రభుత్వం సర్వేకు అనుమతినిచ్చింది అని ప్రస్తుతం సర్వే జరుగుతుందని జెట్ విమానం గుట్టువిప్పినాడు.
నేడు నల్లమలలో వారం రోజుల నుండి యురేనియం సర్వే పెరుగుతున్నది. యురేనియం కంపెనీవారిని ఫారెస్ట్ క్యాంపు ఆఫీస్ లో ఉంచి యురేనియం అధికారులు చేయవలసిన పనులన్నీ ఫారెస్ట్ అధికారులు చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో 2012 నాటి యురేనియం పాయింట్స్ మరియు
నేటి తెలంగాణ ప్రభుత్వం 2014 పెట్టిన యురేనియం వద్ద GP పాయింట్స్ ను గుర్తించటం అవి వెంటనే స్కానింగ్ తీయడం యురేనియం కంపెనీ వారికి వాట్సాప్ ద్వార పంపించడం జరుగుచున్నది. ఫారెస్ట్ అధికారుల యురేనియం పాయింట్ల వెతుకుతూ అడవిలోని బండలపై నెంబర్ వేస్తూ దాదాపు4000బోరు పాయింట్ల గుర్తించడం జరిగింది ఎన్ని చెట్లు నష్టపోతున్నాయి. వాటి విలువ ఎంత అని కొలతలు చేస్తూ సర్వే నిర్వహిస్తున్నారు.
గతములో కరోన వచ్చిన సమయంలోనే అడవిలో మొత్తము రోడ్ల వేసినారు. ఇప్పటి కరోన సమయంలో సర్వేచేస్తూ మద్దీమడుగు నుండి గీసుగండి అక్కడనుండి క్రిష్ణానది వరకు రోడ్లు వేస్తున్నారు. తెలంగాణరాష్ట్ర ప్రభుత్వానికి తెలియదనుకుందామా! తెలిస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు? లేకుంటే కేంద్ర ప్రభుత్వం పై నిందవేసి
యురేనియం తీయాలన్న ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉందా ప్రజలకు తెలియవలసిన అవసరము ఉన్నది. మొదటి నుండి ఫారెస్ట్ అధికారుల వల్లనే నల్లమలకు పెను ప్రమాదము పొంచి ఉన్నది.
ఆనాడు 2014లో ఆనాటి కేంద్ర అటవీ శాఖ ముఖ్య అధికారి అయినా బిలాల్ గారూ నల్లమలవలోని యురేయం నిల్వలను చూపించి యురేనియం కంపెనీ కి అప్పచెప్పటానికి అణువిందన శాస్త్రవేత్త అయిన రాజారాము గారిని వెంటబెట్టుకుని నల్లమలలోని అమ్రాబాద్ కు రావడం జరిగింది. ఆనాడు అమ్రాబాద్ ప్రజలు అడ్డగించడం తో నాటి ప్రమాదము తప్పినది. నేడు ఫారెస్ట్ అధికారులు యురేనియం కంపెనీకి అమ్ముడు పోయి అడవిలోని రాళ్లపై గుర్తులు పెడుతూ 2014 ,2012 నాటి గుర్తులను వెతికి యురేనియం కంపెనీ కి సహకరిస్తున్నారు.
ఫారెస్ట్ అధికారుల ముసుగులో యురేనియం కంపెనీ వారు నల్లమలకు వచ్చి మట్టి నమూనాలు సేకరిస్తూన్నారు. అందుకే యురేనియం కంపెనీ వారిని ఫారెస్ట్ అధికారులను నల్లమలకు రాకుండా తరిమివేద్దాము. మన నల్లమలలోని ఆదివాసీలను పెద్దపులులను వణ్యప్రానులను నదులను ప్రజలను నల్లమలను కాపాడుకోందాము. నల్లమల చల్లగ ఉంటే మన అందరం చల్లగా ఉంటాము. అందుకే వ్యతిరేక జేఏసీ ఆధ్వర్యంలోమరో పోరాటానికి సిద్ధం కావలసిన అవసరం ఎంతైనా ఉంది.