బీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను పార్టీ, అభివృద్ధి కార్యక్రమాలకు పిలవడం లేదని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనను ఎక్కడికి పిలిచినా వస్తానని ఆయన అన్నారు. అది ఎంత చిన్న కార్యక్రమమైనా వస్తానని ఆయన చెప్పారు.
అసలు గ్యాప్ ఎక్కడ వచ్చిందో తనకు అర్థం కావడం లేదన్నారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ నేతృత్వంలో మొదటిసారిగా ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో నామా పాల్గొన్నారు. తనను కూడా అభివృద్ధిలో భాగస్వామిని చేయాలని కార్యకర్తలకు, స్థానిక నేతలకు ఆయన కోరారు.
తనతో కార్యకర్తలకు ఎక్కడ, ఎందుకు గ్యాప్ వచ్చిందో చెప్పాలని ఆయన కోరారు. దీనిపై బీఆర్ఎస్‌లో చర్చ నడుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల్లో అధికార పార్టీ గెలుపు కోసం తాను ఎంతో కృషి చేశానని ఆయన తెలిపారు. అందరం కలిసికట్టుగా పనిచేయాలని పార్టీ నాయకులుకు ఆయన పిలుపునిచ్చారు.
తాను అందరి వాడినని, అందరికి అందుబాటులో వుంటానని ఆయన పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో రాష్ట్రంలో కేసీఆర్ హ్యాట్రిక్ విజయంతో మరోసారి ముఖ్యమంత్రి కానున్నారని చెప్పారు. అందుకు ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం స్ఫూర్తిగా నిలవాలని కోరారు.