వరి ధాన్యం కొనుగోళ్లపై లోక్ సభలో కేంద్రాన్ని నిలదీశారు ఎంపీ నామా నాగేశ్వరరావు. మీరు ఎంత కొంటారో క్లారిటీ ఇస్తే ఇదే విషయాన్ని రాష్ట్ర రైతులకు చెబుతామన్నారు. ప్రస్తుతం తెలంగాణ రైతాంగం మొత్తం రోడ్డు మీద ఉందన్న ఆయన.. కొనుగోళ్లపై కేంద్రం పూటకో మాట మాట్లాడుతోందని ఆరోపించారు.
ఇది తెలంగాణ రైతుల సమస్య మాత్రమే కాదని.. దేశ రైతులదని చెప్పారు నామా. ఇప్పటిదాకా కేంద్రంతో ఆరుసార్లు చర్చలు జరిగాయని వివరించారు. తెలంగాణ రాకముందు ఉద్యోగాల కోసం జనం అరబ్ దేశాలకు వెళ్లేవారని.. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చాక నీళ్లు అందించినట్లు తెలిపారు. అలాగే 24 గంటల ఉచిత కరెంట్, రైతు బంధు ఇస్తున్నామన్నారు. ఫలితంగా రాష్ట్రంలో వరి సాగు గణనీయంగా పెరిగిందని చెప్పుకొచ్చారు నామా నాగేశ్వరరావు.