బోయిన్ పల్లి కేసులో డ్రగ్స్ విక్రేత కెల్విన్ కు నాంపల్లి కోర్టు సమన్లు జారీ చేసింది. అక్టోబరు 11న విచారణకు హాజరు కావాలని నాంపల్లి కోర్టు కెల్విన్ కు సమన్లు జారీ చేసింది. ఇక ఈ కేసు వ్యవహారంలో బోయిన్ పల్లిలో 2016లో కెల్విన్ ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
కెల్విన్ పై ఇటీవల ఛార్జ్ షీట్ దాఖలు చేశారు సీసీఎస్ పోలీసులు. కాగా కెల్విన్ పై అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరించింది నాంపల్లి కోర్టు.