తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పారిశ్రామిక వేత్త, ఎక్సప్రెస్ టీవీ వ్యవస్థాపకుడు జయరామ్ హత్య కేసు మరోసారి తెరమీదకు వచ్చింది. గత ఏడాది జనవరి లో జరిగిన జయరామ్ హత్య కేసులో కీలకంగా ఉన్న పోలీసులపాత్ర పై నాంపల్లి కోర్ట్ విచారణ చేపట్టింది. నిందితుడు రాకేష్ రెడ్డికి సహకరించిన రాయదుర్గం సీఐ రాంబాబు, నల్లకుంట సీఐ శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం ఏసిపి పేర్లను కూడా ఛార్జ్ షీట్ లో చేర్చారు పోలీసులు.
అయితే శాఖాపరమైన విచారణ నిలుపుదల చేయాలని ముగ్గురు పోలీసు అధికారులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సస్పెన్షన్ లో ఉన్న ముగ్గురు పోలీసులు కూడా కోర్ట్ విచారణకు కచ్చితంగా హాజరు కావాల్సిందే అంటూ పిటిషన్ కొట్టిపారేసింది. రాకేష్ రెడ్డి తో సంబంధాలఫై వాంగ్మూలాలను సేకరించి మరో రెండు నెలల్లో తీర్పు ఇవ్వనుంది నాంపల్లి కోర్ట్.