అసెంబ్లీ సమావేశాల వేళ.. తెలంగాణలో మరో ఎమ్మెల్యే కరోనా వైరస్ బారినపడ్డారు. నాంపల్లి ఎమ్మెల్యే జాఫర్ హుస్సేన్‌కు పాజిటివ్ నిర్ధారణ అయింది. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా… అసెంబ్లీ ఆవరణలో ఎమ్మెల్యేలందరికీ వైద్య బృందం రెండోసారి కరోనా పరీక్షలు నిర్వహించింది. ఇందులో జాఫర్‌కు పాజిటివ్ అని తేలింది. దీంతో ఆయన హోం ఐసోలేషన్‌కు వెళ్లారు.
అటు అసెంబ్లీ విధుల్లో ఉన్న 13 మంది పోలీసులకు కరోనా పాజిటివ్ వచ్చింది. కొందరు ఆస్పత్రిలో చేరి చికిత్స తీసుకుంటుండగా.. మరికొందరు ఇంట్లోనే ఉండి విశ్రాంతి తీసుకుంటున్నారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా సభ్యులతో పాటు, అసెంబ్లీ సిబ్బంది, మీడియా, పోలీసులకు కూడా కరోనా పరీక్షలు చేస్తున్నారు.