ఎంఐఎం పార్టీ ఎమ్మెల్యే అక్బర్ ఉద్దీన్ పై నాంపల్లి పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. కరీంనగర్ సభతో పాటు, బీహార్ లో విద్వేషాలను రెచ్చగొట్టేవిధంగా ప్రసంగించారంటూ ఐపీసీ సెక్షన్ 153(A), 153(B), 506 కింద కేసులు నమోదు చేశారు. గతంలో ఒక్క పదిహేను నిముషాలు సమయం ఇస్తే అంతు తెలుస్తామంటూ చేసిన వ్యాఖ్యల అరెస్ట్ అయిన అక్బర్ ఉద్దీన్ కండీషనల్ బెయిల్ మీద తిరుగుతున్నారు. . అయితే తాజా అక్బరుద్దీన్ వ్యాఖ్యలపై నాంపల్లి కోర్ట్ సీరియస్ అయ్యింది. వెంటనే అతని కేసు నమోదు చెయ్యాలని ఆదేశాలు జారీచేసింది.