మహేష్ బాబు నమ్రతలు ఎంత అన్యోన్యంగా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. 2000 సంవత్సరంలో వంశీ సినిమాతో కలిసిన ఈ ఇద్దరు 2005 లో వివాహం చేసుకున్నారు. అయితే ఈ రోజు మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా విషెస్ చెప్తూ నమ్రత సోషల్ మీడియా లో ఒక పోస్ట్ పెట్టారు.
నిజమైన ప్రేమ అంటే ఏంటి అనేది నేను నీతోనే అనుభవించాను. పుట్టినరోజు శుభాకాంక్షలు మహేష్, ఇప్పుడు మరియు ఎల్లప్పుడూ నేను నిన్ను ప్రేమిస్తుంటానని తెలుపుతూ మహేష్ తనకు ముద్దు పెడుతున్న ఫోటోను షేర్ చేసింది. ఇక మహేష్ బర్త్ డే ను ఆయన అభిమానులు గత 10 నుండి సోషల్ మీడియాలో సెలబ్రేట్ చేస్తూన్న సంగతి తెలిసిందే.