సూపర్ స్టార్ మహేష్ బాబు భార్య నమ్రత గురించి కొత్తగా పరిచయం చేయవలసిన పనిలేదు. నమ్రత సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉంటూ మహేష్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ తోపాటు.. పిల్లలు గౌతమ్, సితార, మహేష్ లేటెస్ట్ ఫోటోలను కూడా పోస్ట్ చేస్తూ ఉంటారు.
ఇటీవల ముంబై నుంచి తిరిగి వచ్చిన నమ్రతా హైదరాబాదులోని తమ పొలంలో కి వెళ్లారు. ఆ ప్రదేశానికి సంబంధించి ఓ వీడియో తీసి ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేశారు. టమాటో, ఎర్ర మిరపకాయలు, పత్తి, బెండకాయ తోటలను ఆ వీడియోలో చూపించారు. పొలంలో పండిన వాటికంటే తాజావి ఇంకేముంటాయ్.. ఐ లవ్ ఇట్ అంటూ కామెంట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://www.instagram.com/reel/CI00xBMjDP3/?igshid=1mgx0v7t80cce