ప్రముఖ సినీ నటులు, హిందుపురంఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ 62 వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. BIACH&RI ఆవరణలో నిర్వహించిన ఈ నేడుకల్లో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ.. తన తల్లితండ్రులు స్వర్గీయ బసవతారకం, నందమూరి తారక రామారావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఆరోగ్యశ్రీ పేషెంట్లకు మెరుగైన వైద్య సేవలు అందించాలని తెలిపారు. వీలుగా అత్యాధునిక సౌకర్యాలతో ఆధునీకరించిన సరికొత్త ఆరోగ్యశ్రీ ఓపీడీ బ్లాక్ ను ప్రారంభించారు.
ఈ సంబరాలకు హాజరైన బాలయ్య.. 62 కిలోల కేకును కట్ చేసి.. క్యాన్సర్ తో పోరాడుతున్న చిన్నారులకు తినిపించారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తల్లితండ్రులకు బిడ్డగా వారు సాధించిన పేరును జాతీయ స్థాయిలో నెలబెట్టుకునేందుకు అహర్నిశలు కృషి చేస్తానని చెప్పారు. వారి స్పూర్తితో తన జీవితంలో సినీ నటుడిగా, ప్రజా ప్రతినిథిగా ఎన్నో రకాల పాత్రలను న్యాయబద్దంగా పోషించడానికి అందివచ్చిన అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకొని ముందుకు సాగుతున్నానని అన్నారు.
తన తల్లి జ్ఞాపకార్థం ఎన్టీఆర్ స్థాపించిన బసవతారక క్యాన్సర్ హాస్పత్రిలో ఎంతో మంది అభాగ్యులు జీవిస్తున్నారని తెలిపారు. ఈ విషయంపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామని.. హైదరాబాద్ పరిసరాలలో అనువైన స్థలాన్ని అందజేస్తే హాస్పిటల్ సేవలను మరింత విస్తరించాలని నిర్ణయించామని చెప్పారు.
Advertisements
సంస్థ అభివృద్దిలో ఎప్పటికప్పుడు కీలక పాత్ర పోషిస్తున్న దాతలను ప్రశంసిస్తూ.. వారిని సన్మానించారు బాలయ్య. ఈ నేపథ్యంలోనే గుత్తా భానుమతి.. యాభై లక్షల రూపాయల విలువైన స్థలాన్ని బంగారు రాజు, పరుచూరు ఈశ్వర్ స్థాపించిన యువర్ హెల్ప్ కౌంట్స్ ఫౌండేషన్ ద్వారా 12 వేల యూయస్ డాలర్ల విరాళాన్ని అందజేశారని తెలిపారు. అంతేకాకుండా.. రేవతి, న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ హైదరాబాదు వారు తన తల్లితండ్రులైన రుక్మిణి, వెంకటాచారిల జ్ఞాపకార్ధం పదిలక్షల రూపాయలు, సీతారామ రాజు లక్ష రూపాయల విరాళాన్ని అందజేసినట్టు బాలయ్య తెలిపారు. విరాళాలు అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు బాలయ్య.