నందమూరి బాలకృష్ణ అఖండ సినిమా అఖండ విజయం సాధించింది. ఈ సినిమాలో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించగా శ్రీకాంత్ విలన్ గా నటించారు. పూర్ణ, జగపతి బాబు కీలక పాత్రల్లో నటించారు. గురువారం రిలీజ్ అయిన ఈ చిత్రం ఫస్ట్ డే కలెక్షన్స్ చూసుకుంటే ఓవరాల్ గా 3.24 కోట్ల గ్రాస్ సాధించింది. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే నైజాం లో ఈ సినిమా 4.39 కోట్లు రాగా, సీడెడ్ లో 4.02కోట్లు, ఉత్తరాంధ్ర లో 1.36కోట్లు, ఈస్ట్ లో 1.05కోట్లు, వెస్ట్ లో 96లక్షలు, గుంటూరులో 1.87కోట్లు, కృష్ణ లో 81లక్షలు, నెల్లూరులో 93లక్షలు సాధించింది.
ఆంధ్ర, తెలంగాణలో మొత్తం రూ. 15.39కోట్ల షేర్ ను అఖండ రాబట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇదే జోరు కొనసాగితే సెకండ్ వేవ్ లాక్ డౌన్ తరువాత భారీ స్థాయిలో ఓపెనింగ్స్ అందుకున్న టాప్ సినిమాల్లో అఖండ ప్లేస్ దక్కించుకోటం ఖాయమని అర్ధమైపోతుంది. ఇంకోటి ఏంటంటే ఈ చిత్రం బాలకృష్ణ కెరీర్ లో లేని విధంగా ఓపెనింగ్స్ రాబట్టింది.