నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలయ్య సరసన ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. శ్రీకాంత్ విలన్ గా నటిస్తుండగా… పూర్ణ కీలక పాత్రల్లో నటిస్తుంది. ఇక ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదల అయిన లుక్స్, టీజర్, ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక డిసెంబర్ 2న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగినట్టు తెలుస్తోంది. ఏపీ, తెలంగాణలో మొత్తం 46.40 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 4.47 కోట్లు, ఓవర్సీస్ లో 2.40 కోట్ల బిజినెస్ జరిగిందట.
ఇక దీని ప్రకారం అఖండ సినిమా సేఫ్ జోన్ కు రావాలి అంటే 55 కోట్లకు పైగా షేర్ వసూలు చేయాల్సి ఉంటుంది. అంటే బాలకృష్ణ కెరీర్‌లోనే బ్లాక్ బస్టర్ అయితే తప్ప అఖండ బ్రేక్ ఈవెన్ సాధించటం సాధ్యం కాదు. మరి ఏం జరుగుద్దో చూడాలి.