నందమూరి బాలకృష్ణ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం అఖండ. భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ నటించింది. అలాగే హీరో శ్రీకాంత్ విలన్ గా నటించారు. జగపతిబాబు, కాలకేయ ప్రభాకర్, పూర్ణ కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు ఎస్ ఎస్ తమన్ సంగీతం అందించారు. ఇక గతంలో బాలయ్య బోయపాటి కాంబినేషన్ లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు ఘన విజయం సాధించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కాగా గురువారం ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

కథ విషయానికి వస్తే :
ఫ్యాక్షనిజం కు అలవాటు పడ్డ జనాల్లో మార్పు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తాడు బాలకృష్ణ. అనుకున్నట్టుగానే వారిలో మార్పును తీసుకొస్తాడు. అయితే ఆ ప్రాంతంలో ఉన్న వరదరాజులు విలన్ (శ్రీకాంత్) యురేనియం తవ్వకాలు జరుపుతూ ఉంటాడు. ఈ తవ్వకాల వల్ల ఎంతోమంది ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. దీంతో ఆ యురేనియం తవ్వకాలు ఆపించాలని ప్రయత్నం చేస్తుంటాడు. మరోవైపు చిన్నప్పుడే ఇంటి నుంచి వెళ్లిపోయిన బాలయ్య సోదరుడు శివుడు( బాలయ్య అఘోర ) తిరిగి వస్తాడు. అయితే ఈ ఇద్దరు అన్నదమ్ములు ఎలా కలుస్తారు. తోడ పుట్టిన వాడికి శివుడు ఎలాంటి సహాయం చేస్తాడు. అసలు శివుడు ఎక్కడ పెరుగుతాడు ఇవన్నీ తెలియాలంటే మా సినిమా చూడాల్సిందే.
ఇక నటన పరంగా బాలయ్య నట విశ్వరూపం చూపించారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, యాక్షన్ సన్నివేశాలు అన్నీ కూడా ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. సినిమాకు సెకండాఫ్ మాత్రం హైలెట్ గా నిలిచింది. మరోవైపు బాలయ్య డైలాగ్స్ రచ్చ రంబోలా అనే చెప్పాలి. అలాగే శ్రీకాంత్ యాక్షన్ కూడా అదరగొట్టాడు. మొత్తంగా బాలయ్య బోయపాటి హ్యాట్రిక్ కొట్టారనే చెప్పాలి.